Pollice Power | గాంధీ నోట్లో పటాకులు పెట్టి పేల్చిన మైనర్లు
Pollice Power | గాంధీ నోట్లో పటాకులు పెట్టి పేల్చిన మైనర్లు
సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు
గాంధీ విగ్రహానికి మైనర్లతో పూల మాల వేయించిన పోలీసులు
Telangana News : దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మన జాతి పిత మహాత్మా గాంధీ విగ్రహం నోట్లో బాంబులు పేల్చిన మైనర్లతో పోలీసులు క్షమాపణ చెప్పించారు. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్లు గాంధీ విగ్రహం నోట్లో పటాకులు పెట్టిన పేల్చిరు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన మైనర్లతో గాంధీ విగ్రహానికి పూల మాల వేయించి క్షమాపణలు చెప్పించారు. ఆనంతరం మళ్లీ ఇటువంటి తప్పును మరోకసారి చేయమని ఈ సందర్భంగా మైనర్లు హామీ ఇచ్చారు. అలాగే ఇకపై తమ పిల్లలు తప్పు దోవలో వెళ్లకుండా చూసుకుంటామని వారి తల్లిదండ్రులు హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు.
Leave A Comment